Shoaib Malik on Sania Mirza: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దాదాపు 11 ఏళ్ల క్రితం వివాహబంధంతో ఒక్కటయ్యారు. బోర్డర్లు దాటిన ప్రేమగా వీరి పెళ్లి చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం మాలిక్ లంక ప్రీమియర్ లీగ్ కోసం శ్రీలంకలో ఉన్నాడు. సానియా కూడా అక్కడే ఉంది. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్.. మాలిక్‌ను వంట చేయడం గురించి ప్రశ్నించాడు. దానికి అతడు ఆసక్తికర సమాధానం చెప్పాడు.
సానియా వంటపై మాలిక్ ట్రోల్స్.. ఏమన్నాడంటే! - సానియా మీర్జా వంట
Shoaib Malik on Sania Mirza: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్. ఆమెకు అసలు వంట రాదంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
"ఈ ప్రశ్న నా భార్యను అడగండి. మీకు సరైన సమాధానం దొరుకుతుంది. ఆమెకు అసలు వంట చేయడమే రాదు. బయట నుంచి ఆహారం తెప్పించుకుంటుంది" అంటూ సమాధానమిచ్చాడు మాలిక్.
బాబు పుట్టాక కొంతకాలం ఆటకు విరామం ప్రకటించిన సానియా.. ప్రస్తుతం మళ్లీ రాకెట్ పట్టింది. మాలిక్ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జట్టును సెమీస్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సమయంలో సానియా కూడా యూఏఈలో ఉండి అతడికి మద్దతుగా నిలిచింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ యూఏఈలోనే ఉంటున్నారు.