పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్‌కు(Shoaib Akhtar news) ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఘోర అవమానం జరిగింది. ఆ దేశ అధికారిక పీవీటీ ఛానెల్లో ఓ కార్యక్రమానికి అక్తర్ అతిథిగా హాజరయ్యాడు. షో జరుగుతుండగా మధ్యలోనే షోయబ్‌ను నిష్క్రమించాలంటూ హోస్ట్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ నుంచి బయటకు వచ్చేసిన అక్తర్.. తను చేస్తున్న క్రికెట్ విశ్లేషకుడు ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. హోస్ట్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అవమానించాడని అక్తర్ అన్నాడు.
అసలేం జరిగిందంటే?
టీ20 ప్రపంచకప్‌లో(T20 world cup 2021) భాగంగా మంగళవారం(అక్టోబరు26) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై(T20 world cup 2021 pak vs new zealand) పాక్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత పీటీవీ నిర్వహించిన షోకు అక్తర్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అతనితో పాటు సర్ వివియన్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, రషీద్ లతీఫ్, ఆకిబ్ జావేద్, పాక్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ పాల్గొన్నారు.
షో జరుగుతున్న క్రమంలో హోస్ట్ నోమన్ నియాజ్.. అక్తర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అయితే అక్తర్ దానిని విస్మరించి, పేసర్ హరిస్ రవూఫ్ గురించి మట్లాడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ లాహోర్ ఖలందర్స్, దాని కోచ్ ఆకీబ్పై గురించి చెబుతూ.. హరిస్‌ను వెలుగులోకి తీసుకొచ్చారని ప్రశంసించాడు.
దీంతో అసలు సమస్య మొదలైంది. అక్తర్‌కు అసలు విషయం గురించి మాట్లాడాలని పదేపదే నియాజ్ చెప్పినా వినలేదు. విసుగు చెందిన నియాజ్.. షోయబ్‌తో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని దానిని సహించనని, అలాంటి పరిస్థితుల్లో అతను షో నుంచి నిష్క్రమిస్తే.. కమర్షియల్ బ్రేక్ కోసం వెళ్లడం మంచిదన్నాడు. దీంతో అక్తర్.. లేచి మైక్రోఫోన్ తీసేసి వెళ్లిపోయాడు. అయితే హోస్ట్ నియాజ్.. అక్తర్‌ను తిరిగి పిలవడానికి గానీ, సముదాయించడానికి గానీ ప్రయత్నించలేదు. షోను మామూలుగా కొనసాగించాడు. దీంతో మిగతా గెస్ట్‌లంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ వ్యవహారానికి సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా(Shoaib Akhtar latest video ) మారాయి. దీంతో అక్తర్‌పై సానుభూతి వ్యక్తం చేసిన నెటిజన్లు.. పీటీవీ హోస్ట్ స్పోర్ట్ హోస్ట్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:'పాక్ ఫ్యాన్స్‌కు కోహ్లీ కంటే రోహిత్ అంటేనే ఎక్కువ ఇష్టం'