బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌తో పాటు ఆమిర్ ఖాన్‌కు పాకిస్థాన్‌లో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ విడుదలైన వారి చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించడమే అందుకు నిదర్శనం. పాకిస్థాన్ క్రికెటర్లలోనూ బీ టౌన్ తారలకు అభిమానులు ఉన్నారు. తాజాగా మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. ఆమిర్ ఖాన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఆమిర్ పాటకు పాక్ క్రికెటర్ తనయుడి స్టెప్పులు - ఆమిర్ పాటకు చిందేస్తోన్న పాక్ క్రికెటర్ తనయుడు
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన కుమారుడికి ఓ అద్భుతంగా కనిపిస్తున్నాడంటూ తెలిపాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఈ క్రమంలో తన కుమారుడు ఆమిర్ పాటకు డ్యాన్స్ చేస్తోన్న ఓ వీడియోను షేర్ చేశాడు.
షోయబ్.. సోషల్ మీడియా ఖాతాలో తన తనయుడు డ్యాన్స్ చేస్తోన్న ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతడు ఆమిర్ ఖాన్ నటించిన 'తారే జమీమ్ పర్' సినిమలోని ఓ సాంగ్ వస్తుంటే ఎగిరి గంతులేస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "ఆమిర్ ఖాన్ ఇప్పటికీ నాతో పాటు నా తనయుల కోసం అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇలాగే చేయండి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ఇంతకుముందు తన బయోపిక్ ఏ హీరో చేస్తే బాగుంటుందన్న విషయంపై స్పందించాడు అక్తర్. సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందని తన మనసులోని మాట వెల్లడించాడు.