తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్, రోహిత్ టీ20ల్లోనూ ఆడాలి - లేదంటే వారి ఫేర్​వెల్ బాధ్యత హార్దిక్​దే' : షోయబ్ - రోహిత్ విరాట్ టీ20 రిటైర్మెంట్

Shoaib Akhtar On Rohit - Virat : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రొఫెషనల్ కెరీర్​పై కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. రీసెంట్​గా పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ ఏమన్నాడంటే?

shoaib akhtar on rohit virat
shoaib akhtar on rohit virat

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 5:04 PM IST

Updated : Nov 25, 2023, 5:26 PM IST

Shoaib Akhtar On Rohit - Virat :వన్డే వరల్డ్​కప్ ముగిసిన తర్వాత.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్​ గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గత ఏడాదిగా వీళ్లు టీ20 ఫార్మాట్​కు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సందర్భంలో పాకిస్థాన్‌ మాజీ ప్లేయర్ షోయబ్‌ అక్తర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"ప్రస్తుతం రోహిత్​ను మించిన ఓపెనర్ టీమ్ఇండియాకు లేడు. విరాట్, రోహిత్​లో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. అందుకనే వారు టీ20ల్లోనూ ఆడాలి. వచ్చే ఏడాది వరల్డ్​కప్​ జట్టులోనూ వాళ్లిద్దరు ఉండాలి. ఒకవేళ వారు ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే.. వారికి గ్రాండ్​గా ఫేర్​వెల్ ఇవ్వాల్సిన బాధ్యత ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య తీసుకోవాలి. గతంలో సీనియర్లు ఇదే విధంగా చేశారు. ధోనీ కెప్టెన్సీ హోదాలో సచిన్ తెందూల్కర్​కు, ధోనికి విరాట్ కోహ్లీ.. తర్వాత విరాట్​కు రోహిత్ ఇవ్వల్సిన గౌరవం ఇచ్చారు. ఇప్పుడు హార్దిక్ కూడా అదే ఫాలో అవ్వాలి. కానీ హార్దిక్ ఇద్దరు స్టార్ క్రికెటర్లకు సెండాఫ్ ఎలా ఇస్తాడో ఇంట్రెస్టింగ్​గా ఉంది. కానీ ఇది అతడి కర్తవ్యం" అని అక్తర్ అన్నాడు.

వచ్చే ప్రపంచకప్​లోనూ ఆడాలి.. కెప్టెన్​ రోహిత్ శర్మ.. వచ్చే వరల్డ్​కప్​లోనూ ఆడాలని శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరణ్ అన్నాడు."రోహిత్ శర్మ మరో ప్రపంచకప్ ఆడాలి. అతడు వన్డేల్లోనే.. టీ20 తరహా, దాదాపు 130 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ వరల్డ్​ క్లాస్ ప్లేయర్. అంతేకాదు అతడు అనుభవజ్ఞుడు కూడా" అని అన్నాడు.

వాళ్లిద్దరూ ఉండాల్సిందే.. 2024 టీ20 వరల్డ్​కప్​ టీమ్ఇండియాలో రోహిత్, కోహ్లీ ఉండాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. '2024 టీ20 వరల్డ్​కప్​లో రోహిత్.. టీమ్ఇండియాకు సారథ్యం వహించడం చూడాలని ఉంది. అతడు అత్యుత్తమ బ్యాటర్. అలాగే విరాట్ కోహ్లీ కూడా జట్టులో ఉండాలి' అని గంభీర్ ఇటీవల ఓ సందర్భంలో అన్నాడు.

'టీ20 భవిష్యత్​పై నిర్ణయం మీదే' - రోహిత్​, విరాట్​కు బీసీసీఐ ఫుల్ ఫ్రీడమ్! - ఆడాల్సిందేనంటూ ఫ్యాన్స్​ రిక్వెస్ట్​

ఫ్యాన్స్​ అందరికీ సేమ్​ డౌట్!- రోహిత్-విరాట్​ గమనం ఎటో?

Last Updated : Nov 25, 2023, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details