Shoaib Akhtar On India Pakistan Match :భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులకు నరాల తెగే ఉత్కంఠ ఉంటుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ మధ్య ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌కు ఆదివారం వర్షం ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటం వల్ల ఎక్కడైతే ఆట నిలిచిందో అక్కడి నుంచి సోమవారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ పేస్ దళాన్ని టీమ్ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ సమర్థంగా ఎదుర్కొని జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో పాక్ ఆటతీరుపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాక్ జట్టుపై విమర్శలు చేశాడు.
లీగ్ స్టేజ్‌లో వర్షం భారత్‌కు అనుకూలంగా మారితే.. సూపర్ 4 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ దాడి నుంచి వరుణుడు పాక్‌ను రక్షించాడని అక్తర్ అన్నాడు.'నేను భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు శ్రీలంక వెళ్లాను. ఇరుదేశాల అభిమానులంతా మ్యాచ్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇంతకు మందు మ్యాచ్‌లో వరుణుడు భారత్‌ను కాపాడాడు. ఆదివారం పడిన వర్షం పాకిస్థాన్‌ను రక్షించింది.' అని అక్తర్ ఎక్స్(ట్విటర్) వేదికగా ఓ వేడియోను షేర్ చేశాడు.
దాయాదుల మధ్య జరిగిన లీగ్ పోరులోమాదిరిగా.. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. భారత ఓపెనర్లు వారిని అలవోకగా ఎదుర్కొని పరుగుల వరద పారించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (58), రోహిత్ శర్మ (56) జట్టుకు అదిరే ఆరంభాన్నివ్వగా.. విరాట్ కోహ్లి (8), కేఎల్ రాహుల్ (17) క్రీజులో ఉన్నారు. వర్షం పడే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో 147/2తో ఉంది.