ఇంగ్లాండ్ కుర్రాళ్ల జట్టు.. పటిష్టమైన పాక్‌ను మట్టికరిపించటంపై అభిమానులు, మాజీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాకిస్థాన్ జట్టు వరుస వైఫల్యాలపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) మండిపడ్డాడు. పాక్ ఆటతీరు చాలా సాధారణంగా ఉందన్నాడు. ఈ మేరకు టీం నిర్వహక బృందం, బోర్డు సభ్యులు, ఆటగాళ్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే.. పాకిస్థాన్ 3-0 తో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఖాయమన్నాడు. ఇలాంటి ప్రదర్శనతో భవిష్యత్తు తరాల ఆటగాళ్లలో స్ఫూర్తి నింపగలరా? అని ప్రశ్నించాడు.
వైఫల్యం విలువ..
ఈ పరాజయం విలువ రిక్టర్ స్కేల్‌పై 15గా ఉందని ఆ దేశానికే చెందిన మరో మాజీ క్రికెటర్ రమీజ్ రాజా(Ramiz Raja) తీవ్ర విమర్శలు చేశాడు. పాకిస్థాన్.. వరుస వైఫల్యాల కారణంగా అభిమానులు ఆటపై ఆసక్తి కనబరచటం లేదన్నాడు.