కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న భారత్‌ను ఆదుకోవాలని పాకిస్థాన్‌లోని తన అభిమానులను కోరాడు ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఈ సమయంలో ప్రపంచ దేశాల సహకారం భారత్‌కు అవసరమని తన యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించాడు.
"ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం అసాధ్యం. భారత్‌ను ఆదుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని, నా అభిమానులను కోరుతున్నా. భారత్‌కు చాలా ఆక్సిజన్ ట్యాంకులు అవసరం. ఆ దేశం కోసం విరాళాలు, నిధులు సమకూర్చి, ఆక్సిజన్ ట్యాంకులను చేరవేయాలని విజ్ఞప్తి చేస్తున్నా."
- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
భారత్‌లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోందని అక్తర్ పేర్కొన్నాడు. మహమ్మారి అందరినీ పీడిస్తోందన్న ఆయన.. ఈ సమయంలో ఒకరికొకరు తోడుగా నిలవాలని పిలుపునిచ్చాడు.