ఈ నెల 29న నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతినిధిగా శివ్‌లాల్ యాదవ్ పాల్గొనేందుకు అనుమతించాలని బీసీసీఐని కోరుతూ మెయిల్ పంపించామని హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ శుక్రవారం తెలిపారు. ఇటీవల జరిగిన తమ సంఘం ఏజీఎంలో బీసీసీఐలో హెచ్‌సీఏ ప్రతినిధిగా శివ్‌లాల్‌ను నియమించిన విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
'ఆ సమావేశానికి శివ్‌లాల్‌ను అనుమతించండి' - బీసీసీఐ ఎస్‌జీఎంకు శివలాల్ యాదవ్
ఈ నెల 29న నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో హెచ్‌సీఏ ప్రతినిధిగా శివ్‌లాల్ యాదవ్‌ను అనుమతించాలని బీసీసీఐని కోరారు హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్. ఈ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించనున్నారు.
!['ఆ సమావేశానికి శివ్‌లాల్‌ను అనుమతించండి' HCA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11851733-632-11851733-1621645079310.jpg)
హెచ్‌సీఏ
ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించనుంది బీసీసీఐ. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ నిర్వహణ, ఐపీఎల్ మిగతా టోర్నీని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న దానిపై చర్చించనున్నారు.