Shikhar Dhawan World Cup 2023 : రానున్న ప్రపంచ కోసం ఎంపికైన టీమ్ఇండియా సీనియర్ ప్లేయయ్ శిఖర్ ధావన్‌కు జట్టులో స్థానం దక్కలేదు. దీంతో ఆయన అభిమానుల పాటు పలువురు మాజీలు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై తొలిసారి శిఖర్ ధావన్ స్పందించాడు. తనకు టీమ్‌లో చోటు దక్కకపోయినప్పటికీ..ధావన్ తన మంచి మనసును చాటుకున్నాడు. "వెళ్లి మీ ప్రతాపం చూపండి.. ట్రోఫీ గెలవండి" అంటూ రోహిత్ సేనకు మద్దతిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన నెటిడన్లు ధావన్‌ను కొనియాడుతున్నారు.
"వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కోసం ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్న నా సహచరులకు, స్నేహితులకు శుభాకాంక్షలు. దేశంలోని 150 కోట్ల మంది ప్రజలు ప్రార్థనలు, మద్దతుతోపాటు మా ఆశలు, కలలను మీరు మోస్తున్నారు. మీరు కప్పు గెలిచి మమ్మల్ని గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతాపం చూపించండి టీమ్ఇండియా.. చక్ దె ఫట్టే" అంటూ ధావన్ ట్వీట్ చేశారు.
Dhawan International Career : అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధావన్.. అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. టెస్టు క్రికెట్లో అయితే తన దైన శైలిలో ఆడి అందరి చేత ఔరా అనిపించాడు. 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో.. 2011లో టీ20ల్లో, 2013లో టెస్టుల్లో అడుగులు వేశాడు. 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన టెస్టు శతకం చేసిన అరంగేట్ర ఆటగాడిగా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.