Shikhar Dhawan Odi Career : టీమ్ఇండియా సీనియర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ శిఖర్ ధావన్.. అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ పర్యటన తర్వాత ధావన్‌కు జట్టులో చోటు దక్కలేదు. అయితే తాజా ఐపీఎల్‌లోనూ 142 స్ట్రైక్ రేట్‌తో 373 పరుగులతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన ధావన్.. ఈసారి కనీసం ఒక పర్యటనలో ఎంపికవుతాడని భావించారు అతడి ఫ్యాన్స్.
కానీ డబ్ల్యూటీసీ ఫైనల్, విండీస్ టూర్లకు ధావన్ ఎంపికకాలేదు. ఇక అసియా ఛాంపియన్స్షిప్నకు బీసీసీఐ .. కుర్రాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ధావనే ఈ యువ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న వాదనలూ వినిపించాయి. కానీ అనుహ్యంగా యంగ్‌ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కే.. సెలక్టర్లు మొగ్గుచూపారు. దీంతో ధావన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. కానీ నాలుగేళ్లుగా వన్డేల్లో ధావన్ గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. మరీ అంత పేలవంగా ఏమీ లేదనిపిస్తుందనేది వాస్తవమైన మాట.
2019 ప్రపంచకప్ తర్వాత ధావన్ 37 మ్యాచ్‌లకుగాను.. 35 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. 41.03 సగటున 1313 పరుగులు చేశాడు ధావన్. ఇందులో ఏకంగా 12 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక పూర్తి వన్డే కెరీర్ చూస్తే.. ఇప్పటి వరకు 167 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 44 సగటున ధావన్.. 6793 పరుగులు చేశాడు. వన్డే కెరీర్లో 17 శతకాలు, 39 అర్ధశతకాలు సాధించాడు. కాగా 2015 ప్రపంచకప్‌లోనూ 412 పరుగులు చేసి టీమ్ఇండియాలో కీలకంగా మారాడు.