తెలంగాణ

telangana

ETV Bharat / sports

Shikhar Dhawan Divorce : శిఖర్‌ ధావన్‌కు విడాకులు మంజూరు.. విచారణలో తేలిన నిజాలు

Shikhar Dhawan Divorce : : టీమ్‌ఇండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ , ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ కేసులో ప్రాథమికంగా అతడి భార్య క్రూర ప్రవర్తన కారణంగానే వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థాం ఈ సందర్భంగా వెల్లడించింది.

Shikhar Dhawan Divorce
Shikhar Dhawan Divorce

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 11:12 AM IST

Updated : Oct 5, 2023, 11:37 AM IST

Shikhar Dhawan Divorce : టీమ్‌ఇండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ , ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ కేసులో ప్రాథమికంగా అతడి భార్య క్రూర ప్రవర్తన కారణంగానే వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థాం ఈ సందర్భంగా వెల్లడించింది. అయితే వాళ్లు విడిపోతున్నట్లు రెండేళ్ల క్రితమే శిఖర్‌ ధావన్‌ దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ.. ధావన్‌ దిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా భార్య ఆయేషా ముఖర్జీపై ధావన్‌ చేసిన ఆరోపణలను కోర్టు సమర్థించింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని ఆయేషా రుజువు చేసుకోలేకపోయినట్లు కోర్టు పేర్కొంది.

"తన ఒక్కగానొక్క కుమారుడికి దూరంగా ఉండాలని ధావన్‌ను అతడి భార్య మానసికంగా వేధించినట్లు కోర్టు గుర్తించింది. ఆయేషా తొలుత ధావన్‌తో కలిసి భారత్‌లో ఉండేందుకు ఒప్పుకుంది. కానీ, తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది. దీంతో ధావన్‌ తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ధావన్‌ తన సొంత డబ్బుతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు కల్పించాలంటూ ఆమె ఒత్తిడి చేసినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఒక ఆస్తిలో 99శాతం వాటా, మిగతా రెండు ఆస్తుల్లో సహ యాజమాన్యం కావాలని ఆమె డిమాండ్‌ చేసినట్లు ధావన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలను ఆమె వ్యతిరేకించలేదు. అందువల్ల ఇవన్నీ వాస్తవమేనని కోర్టు గుర్తించింది" అని న్యాయస్థానం తమ తీర్పు సందర్భంగా వెల్లడించింది.

మరోవైపు శిఖర్‌ ధావన్‌ పరువుకు భంగం కలిగించేలా ఆయేషా ఉద్దేశపూర్వకంగా తోటి క్రికెటర్లు, బీసీసీఐ, ఐపీఎల్‌ జట్టు యాజమాన్యానికి తప్పుడు సందేశాలు పంపించినట్లు విచారణలో తేలింది. తన మొదటి భర్తతో కలిగిన ఇద్దరు కుమార్తెల ఫీజులు, ఇతరత్రా ఖర్చుల కోసం కూడా ధావన్‌ నుంచి ఆమె డబ్బులు డిమాండ్‌ చేసినట్లు కోర్టు గుర్తించింది.

ధావన్‌ చేసిన ఆరోపణలన్నీ నిజమని తేలడం వల్ల కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే, తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్‌ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కానీ, ధావన్ తన కుమారుడితో వీడియో కాల్‌ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతించింది. స్కూల్‌ వెకేషన్‌ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చి ధావన్‌ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది.

Shikhar Dhawan Family : ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని శిఖర్​ ధావన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల 2020 నుంచి ఈ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ధావన్‌ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు.

Shikhar Dhawan World Cup 2023 : వరల్డ్​ కప్​ జట్టుపై ధావన్ రియాక్షన్​.. ​గబ్బర్​ ట్వీట్​కు ఫ్యాన్స్​ ఫిదా​

Asia Cup Best Partnership : ధోనీ -రైనా.. ధావన్​- రోహిత్​.. ఆసియా కప్​లో బెస్ట్ పార్టర్న్​షిప్స్​ ఇవే!

Last Updated : Oct 5, 2023, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details