టీమ్ఇండియా కోచింగ్ బృందంలోని ప్రధాన కోచ్ రవిశాస్త్రి(ravi shastri coaching tenure), ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ల పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా ఇన్నాళ్లు జట్టుకు ఎంతగానో సహకరించిన వీరికి ధన్యవాదాలు తెలిపాడు భారత జట్టు వన్డే, టెస్టు సారథి విరాట్ కోహ్లీ(virat kohli news).
"జట్టుగా మనమెన్నో మరపురాని విజయాలు సాధించాం. ఈ కాలంలో ఎన్నో జ్ఞాపకాల్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. మీరు అందించిన ఈ గొప్ప సహకారం భారత క్రికెట్ చరిత్రలో మిగిలిపోతుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా" అని కోహ్లీ(virat kohli news) ట్వీట్ చేశాడు.
రోహిత్‌కు కెప్టెన్సీ
టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. ప్రపంచకప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్ కోహ్లీకి టీ20 కెప్టెన్(virat kohli captaincy news)గా చివరిది. ఈ నేపథ్యంలో నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ(rohit sharma news)ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ నుంచే భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(rahul dravid coach) బాధ్యతలు చేపట్టనున్నాడు.
ప్రస్తుత టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో కోహ్లీ నాయకత్వంలోని టీమ్ఇండియా నిరాశ పరిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన కోహ్లీసేన సెమీస్ రేసులో వెనుకబడింది. దీంతో చివరి మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించినా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.