టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కెప్టెన్సీ(Virat Kohli Captaincy) వదులుకోవాలని ప్రధాన కోచ్ రవిశాస్త్రినే చెప్పారట. టెస్టుల్లో జట్టుకు సారథ్యం వహిస్తూ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడంలో భాగంగానే ఈ పని చేయమన్నట్లు సమాచారం.
అందుకేనా?
"ఈ సూచన కోహ్లీని తక్కువ చేయడానికి కాదు. ప్రపంచ క్రికెట్లో అతడు టాప్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగడం కోసమే" ఓ వార్త సంస్థ పేర్కొంది. విరాట్ మాత్రం శాస్త్రి సూచనలు వినకుండా కేవలం టీ20 సారథ్యాన్ని (Virat Kohli T20I Captaincy) మాత్రమే వదులుకొని, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతున్నట్లు తెలిపింది.
రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ లేకుండానే ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది టీమ్ఇండియా. నాటి నుంచి కోహ్లీ సారథ్యంపై చర్చలు మొదలయ్యాయి.
6 నెలల క్రితమే..
ఈ వ్యవహారంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. 6 నెలల క్రితమే వైట్‌బాల్ కెప్టెన్సీ విషయమై కోహ్లీతో (Virat Kohli Captaincy) శాస్త్రి మాట్లాడినట్లు తెలిపారు.
"రవిశాస్త్రి చెప్పాడు కానీ కోహ్లీ వినలేదు. వన్డేల్లో సారథ్యం వదులుకోవడానికి అతడు సిద్ధంగా లేడు. అందుకే టీ20 కెప్టెన్సీ మాత్రమే విడిచిపెట్టాడు. కోహ్లీని బ్యాట్స్‌మన్‌గా మరింతగా ఉపయోగించుకోవడంపై బోర్డు కూడా చర్చిస్తోంది"