Shardul Thakur Injury :టీమ్ఇండియా స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్ ఇటీవలే గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాల్ అతడి ఎడమ భుజానికి బలంగా తగిలింది. అయితే ఆ తర్వాత నుంచి శార్దూల్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. బౌలింగ్ కూడా చేయలేదు. కాసేపటి తరువాత తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. సెషన్ ముగిసిన తరువాత జట్టు ఫిజియో వచ్చి శార్దూల్ భుజం చుట్టూ ఓ ఐస్ ప్యాక్ బ్యాగ్‌ను ఉంచాడు. దీంతో కాసేపు శార్దూల్ విశ్రాంతి తీసుకున్నాడు. అయితే గాయం తీవ్రత గురించి మాత్రం ఇంకా తెలియదు. రెండో టెస్ట్ సమయంలో ఇలాంటి గాయం అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోందని నెటిజన్లు అంటున్నారు. అంతే కాకుండా జనవరి 3న ఆరంభమయ్యే రెండో టెస్టుకు అతడు దూరమవుతాడన్న కూడా నెట్టింట మార్మోగిపోతున్నాయి.
ఇక తొలి టెస్టులో శార్దూల్ క్రికెట్ అభిమానులను నిరాశపరిచాడు. 19 ఓవర్లు వేసిన ఈ స్టార్ పేసర్ ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 101 పరుగులను సమర్పించుకున్నాడు. అంతే కాకుండా అటు బ్యాట్‌తోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
మ్యాచ్ సాగిందిలా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియాపై సఫారీలు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది.