తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేకేఆర్​ కెప్టెన్సీ రేసులో ఆ ఇద్దరి పేర్లు.. కొత్త సారథి ఎవరో? - shaardul thakur ipl 2023 kkr new captain

ఐపీఎల్​-2023 సీజన్​లో కేకేఆర్​ జట్టు కెప్టెన్ రేసులో టీమ్​ఇండియా స్టార్​ ఆల్​రౌండర్​ శార్దూల్ ఠాకూర్, సునీల్​ నరైన పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కోల్​కతా శార్దూల్ ఠాకూర్​ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు.

shaardul thakur ipl 2023 kkr new captain
ఐపీఎల్​ 2023 కేకేఆర్​ కొత్త కెప్టెన్​గా శార్దూల్ ఠాకూర్​

By

Published : Mar 27, 2023, 5:56 PM IST

Updated : Mar 27, 2023, 6:14 PM IST

మార్చి 31న జరగబోయే ఐపీఎల్​-2023 సీజన్​లో కేకేఆర్​ జట్టు కెప్టెన్​గా టీమ్​ఇండియా స్టార్​ ఆల్​రౌండర్​ శార్దూల్ ఠాకూర్​ను ఎంపికే చేసే యోచనలో ఉన్నారు కోల్‌కతా ఫ్రాంచైజీ సెలెక్టర్లు. వాస్తవానికి ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌ సీజన్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్​కు కెప్టెన్​గా స్టార్​ బ్యాటర్​ శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేశారు. కానీ, గత కొంతకాలంగా శ్రేయస్​ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంతో.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు కూడా దూరంగా ఉన్నాడు. అయితే నొప్పి నుంచి కాస్త కోలుకోవడంతో మూడో టెస్టులో ఆడేందుకు శ్రేయస్​కు అవకాశం వచ్చింది. అయితే అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో అయ్యర్‌ను గాయం మళ్లీ ఇబ్బంది పెట్టింది. దీంతో ఆ మ్యాచ్​లో అతడు బ్యాటింగ్​ చేయలేదు. తాజాగా ఆసీస్​తో జరిగిన మూడు వన్డేల సిరీస్​కు కూడా శ్రేయస్​ అయ్యర్​ దురంగానే ఉన్నాడు.

ఇలా పదేపదే జట్టుకు దూరంగా ఉండడంతో తన వెన్నుముక సంబంధిత సమస్యకు ఆపరేషన్​ చేయించుకోవాలని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం అయ్యర్‌ను సూచించింది. కానీ, ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో అయ్యర్‌.. ఎన్​సీఏ సలహాను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. వీరి సూచన మేరకు ఒక వేళ అయ్యర్​ సర్జరీ చేయించుకుంటే దాదాపు ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ఇంటి వద్దే విశ్రాంతి​ తీసుకుంటున్నాడు అయ్యర్‌. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌కు అయ్యర్‌ దూరంగా ఉండనున్నాడు.

దీంతో శ్రేయస్​ అయ్యర్​ స్థానంలో కేకేఆర్​కు కొత్త కెప్టెన్​ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు ఫ్రాంచైజీ సెలక్టర్లు. ఇక ఈ కెప్టెన్సీ రేసులో ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రేసులో కేకేఆర్​ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్​తో పాటు సునీల్ నరైన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ, యూఏఈ టీ20లీగ్‌లో కేకేఆర్‌ ఫ్రాంచైజీ అబుదాబి నైట్‌రైడర్స్‌ తరఫున సారథ్యం వహించిన సునీల్ నరైన్ పూర్తిగా విఫలమయ్యాడు. అతడి​ కెప్టెన్సీలోని నైట్‌రైడర్స్‌ కేవలం ఒక్క మ్యాచ్‌ను మాత్రమే గెలిచింది. దీంతో అతడిని కేకేఆర్​ కెప్టెన్​గా ఎంపిక చేయరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నరైన్‌ను కాదని శార్దూల్‌ ఠాకూర్​కే తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్‌ జట్టు మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ జట్టు కొత్త కెప్టెన్‌ పేరును ఒకట్రెండు రోజుల్లో కేకేఆర్‌ ప్రకటించే అవకాశం ఉందట. ఐపీఎల్‌-2023 మినీ వేలంకు ముందు దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి ట్రేడింగ్‌ ద్వారా శార్దూల్‌ను రూ.10.75 కోట్లకు కోలకతా కొనుగోలు చేసింది. ఇక కేకేఆర్‌ తమ తొలి మ్యాచ్​ను పంజాబ్‌ కింగ్స్‌తో ఏప్రిల్‌1న ఆడనుంది.

Last Updated : Mar 27, 2023, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details