బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితయ్యాడు. తొలి టెస్టులో కుల్‌దీప్ యాదవ్ కోసం ఆపారు. ఇక రెండో టెస్టులో శార్దూల్‌ని కాదని జయ్‌దేవ్ ఉనద్కత్‌కు అవకాశం దక్కింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో శార్దూల్‌కి మద్దతుగా కొన్ని ట్వీట్లు కనిపిస్తున్నాయి. శార్దూల్ జట్టులో ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో క్రికెట్ - రాజకీయం అంటూ కొంతమంది ఘాటుగా ట్వీట్లు చేశారు.
అయితే ఇక్కడ సమస్య ఆ ట్వీట్లు కాదు.. అలాంటి కొన్ని ట్వీట్లకు శార్దూల్ ఠాకూర్ లైక్ కొట్టడమే. 'జట్టు ఎంపికలో రాజకీయాలున్నాయా?' అంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. మరికొంతమంది ఇవన్నీ వదిలేసి రంజీలకు వెళ్లిపో అంటూ ట్వీటారు. అలాంటి వాటిని శార్దూల్ లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుల్‌దీప్ యాదవ్‌ను కాదని జయదేవ్ ఉనద్కత్‌ను ఎంచుకోవడంపై ఓ వైపు చర్చ జరుగుతుండగా, ఇలా శార్దూల్ విషయం సోషల్ మీడియాకి ఎక్కడంతో 'టీమ్ ఇండియాలో ఏమవుతోంది' అనే చర్చ సాగుతోంది.