Shantha Rangaswamy on Mandhana Captaincy: భారత మహిళల క్రికెట్లో స్టార్‌గా ఎదిగింది మిథాలీ రాజ్. కొన్నేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తూ టీమ్ఇండియాను శిఖరాగ్రానికి చేర్చింది. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్ అవబోతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది మిథాలీ. ఈ నేపథ్యంలో ఈమె వారసురాలిగా భారత జట్టు పగ్గాలు ఎవరందుకుంటారనే విషయమై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి.. ఆ స్థానానికి స్మృతి మంధాన సరైన ఎంపికని అభిప్రాయపడింది.
మిథాలీకి సరైన వారసురాలు మంధాన: రంగస్వామి - మిథాలీ రాజ్ శాంతా రంగస్వామి
Shantha Rangaswamy on Mandhana Captaincy: భారత వెటరన్ స్టార్ మిథాలీ రాజ్‌కు స్మృతి మంధానానే సరైన వారసురాలని మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి తెలిపింది. మంధానాకు జట్టును నడిపించే బాధ్యతను కూడా ఇవ్వాలని అభిప్రాయపడింది.
"మిథాలీ రిటైర్ అయిన తర్వాత జట్టును నడిపించడానికి స్మృతి సరైన ప్రత్యామ్నాయం. ఆమె కొన్నేళ్లుగా బ్యాటర్‌గా రాణిస్తోంది. ఇప్పుడు జట్టును నడిపించే అవకాశాన్ని కూడా ఇవ్వాలి" అని శాంత చెప్పింది.
2016 నుంచి టీ20 జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉంది. అయితే బ్యాటింగ్‌లో స్థిరంగా రాణించలేకపోతున్న ఆమెకు వన్డే, టెస్టు పగ్గాలు అప్పగిస్తారా? అన్నది సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో శాంత ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత మహిళల క్రికెట్లో టాప్ బ్యాటర్‌గా ఎదిగిన మంధాన.. భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉంది. ఇప్పటిదాకా 4 టెస్టులు ఆడిన ఆమె.. 62 వన్డేలు, 84 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. తాజాగా మహిళల బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున సెంచరీతో స్మృతి సత్తా చాటింది. మార్చిలో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌లో భారత్ పర్యటించనుంది.