145 టెస్టు మ్యాచ్‌లు 708 వికెట్లు! ఏ బౌలర్‌కైనా ఈ గణాంకాలను అధిగమించాలంటే చాలా కష్టం. ఇలాంటి రికార్డులు నెలకొల్పిన ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్.. పొగ తాగనిదే మైదానంలోకి దిగడనే విషయం ఎంతమందికి తెలుసు. ఇందుకు సంబంధించి డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్‌ను బయటపెట్టాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.
"వార్న్.. మైదానంలో జరిగిన విషయాలను అక్కడే విడిచిపెడతాడు. అతడు గ్రౌండ్లోకి వచ్చే ముందు పొగ తాగుతాడు. స్టేడియంలోకి అడుగు పెట్టే ముందు దానిని ఓ చోట పడేస్తాడు. బరిలోకి దిగాక మళ్లీ దాని గురించి పట్టించుకోడు. తాను చేయాల్సిన పనిని చేస్తాడు. గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాక మళ్లీ పొగ తాగుతాడు. నాకు తెలిసి ఇది అతనికి గొప్ప శక్తిని ఇస్తుందేమో. అతడు మానసికంగా దృఢంగా కావడానికి ఉపయోగపడుతుందేమో. కెరీర్ మొత్తం ఇలాగే చేశాడు."
- మైకేల్ క్లార్క్, ఆసీస్ మాజీ కెప్టెన్.