Shane Warne News: మృత్యువు ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో.. ఆత్మీయులను ఏ రూపంలో దూరం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ విషయంలోనూ అదే జరిగింది. తన తోటి క్రికెటర్ మృతికి సంతాపం తెలిపిన కొన్ని గంటలకే వార్న్ మృతి చెందడం క్రీడా లోకాన్ని కలచివేసింది. అతడు చివరగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రామ్ మార్ష్ (74) క్వీన్స్‌ల్యాండ్‌లో ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ షేన్ వార్న్ శుక్రవారం ట్వీట్ చేశాడు.
"రాడ్ మార్ష్ మృతి చెందాడన్న వార్త వినడం బాధాకరం. క్రికెట్‌లో ఆయనో లెజెండ్. చాలా మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రేరణ. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నా"అని షేన్ వార్న్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చేసిన సరిగ్గా 12 గంటలకే వార్న్ మరణించాడు. వార్న్ మరణ వార్త అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. బహుశా విధి అంటే ఇదేనేమో అని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
షేన్ వార్న్ రికార్డులు..