తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్న్‌ చివరి క్షణాల్లో ఏం చేశారంటే? - షేనాా వార్న్​ మేనేజర్​

shane warne last moments: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్​ వార్న్​ మృతి.. యావత్ క్రికెట్​ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి కొన్ని క్షణాలకు ముందు ఏం జరిగిందో వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్​కిన్​​ తెలిపారు. కాగా, ఆయన​ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్​ ప్రకటించారు.

షేన్‌ వార్న్‌
shane warne

By

Published : Mar 6, 2022, 7:12 AM IST

shane warne last moments: స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మరణంతో క్రికెట్‌ ప్రపంచం షాక్‌కు గురైంది. 52 ఏళ్ల ఆయన శుక్రవారం గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందారు. థాయ్‌లాండ్‌లో విహారంలో ఉన్న ఆయన మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో వార్న్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్స్‌కిన్‌ బయటపెట్టారు. అచేతనంగా పడిపోయే ముందు వార్న్‌.. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టును టీవీలో చూసినట్లు తెలిసింది.

"మ్యాచ్‌ల వ్యాఖ్యానం కోసం ఇంగ్లాండ్‌ వెళ్లే ముందు దొరికిన సమయాన్ని గడిపేందుకు వార్న్‌ థాయ్‌లాండ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో వార్న్​ మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోను కలిసి భోజనం చేద్దామనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మరికొంత మందిని వార్న్‌, నియోఫిటో కలవాలనుకున్నారు. పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్‌ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనికి ఏదో అయిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు. హృదయ స్పందన లేకపోవడంతో సీపీఆర్‌ చేశాడు. 20 నిమిషాల తర్వాత అంబులెన్స్‌ వచ్చింది. ఓ గంట తర్వాత వార్న్‌ చనిపోయారనే విషయం తెలిసింది. ఆయన రెండు గంటల ముందు చివరగా చూశా. ఎక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నారు" అని సుదీర్ఘ కాలంగా వార్న్‌ మేనేజర్‌గా ఉన్న జేమ్స్‌ చెప్పారు. మరోవైపు ఆసుపత్రికి తీసుకు వచ్చేలోపే వార్న్‌ ప్రాణాలు పోయాయని థాయ్‌ అంతర్జాతీయ ఆసుపత్రి వెల్లడించింది.

అధికారిక లాంఛనాలతో..

వార్న్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ శనివారం ప్రకటించారు. వార్న్‌ హఠాన్మరణంతో ఆస్ట్రేలియా ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. "అధికారిక లాంఛనాలతో వార్న్‌ అంత్యక్రియలు చేస్తాం. మా దేశపు అత్యుత్తమ వ్యక్తుల్లో వార్న్‌ ఒకడు. క్రికెట్‌ ఆడేలా ఎంతోమంది అబ్బాయిలు, అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచాడు"అని మోరిసన్‌ తెలిపారు. మరోవైపు వార్న్‌ గౌరవార్థం ఎంసీజీ మైదానంలోని ది గ్రేట్‌ సదర్న్‌ స్టాండ్‌కు అతని పేరు పెట్టనున్నట్లు విక్టోరియా క్రీడల మంత్రి మార్టిన్‌ ప్రకటించారు. వార్న్‌ ఆ మైదానంలో తన 700వ టెస్టు వికెట్‌తో పాటు ఓ యాషెస్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ తీసుకున్నాడు. ఇప్పటికే ఆ మైదానం బయట వార్న్​ విగ్రహం ఉంది. మరణవార్త తెలిసిన తర్వాత ప్రజలు అక్కడికి చేరుకుని పూలు, క్రికెట్‌ బంతులు విగ్రహం దగ్గర ఉంచి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:Shane Warne: అలాంటి కళాత్మకత వార్న్‌కే సాధ్యం!

ABOUT THE AUTHOR

...view details