తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్న్ గదిలో రక్తపు మరకలు.. కారణం ఏంటి?

Shane Warne death: స్పిన్​ మాంత్రికుడు షేన్​ వార్న్​ మృతిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వార్న్​గదిలో రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపినట్లు థాయ్​లాండ్ మీడియా పేర్కొంది. నేలపై, టవల్స్​పైనా రక్తపు మరకలను పోలీసులు గుర్తించారని వెల్లడించింది.

Shane Warne
షేన్​ వార్న్

By

Published : Mar 6, 2022, 3:51 PM IST

Shane Warne death: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్​ వార్న్​ మృతిపై థాయ్​లాండ్​ పోలీసులు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. వార్న్​ నివాసం ఉన్న విల్లాలోని గదిలో థాయ్​ పోలీసులు సోదాలు నిర్వహించారు. గదిలోని ఫ్లోర్​పై, టవల్స్​పై రక్తపు మరకలను గుర్తించారు. ఈ మేరకు థాయ్​లాండ్​లోని స్థానిక మీడియా పేర్కొంది. ​

52 ఏళ్ల షేన్​ వార్న్​ హాలీడేస్​ని గడపడానికి థాయ్​లాండ్​ వెళ్లాడు. అతడు ఉన్న విల్లాలో గుండెపోటు రావడం వల్ల స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. వార్న్​ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు థాయ్​లాండ్​ ఇంటర్​నేషనల్​ హాస్పిటల్​ శుక్రవారం వెల్లడించింది.

"గుండెపోటు రావడం వల్ల అతడికి సీపీఆర్​ మొదలుపెట్టారు. దీంతో అతడికి రక్తస్రావం అయ్యింది. అతడి గుండెను డాక్టర్లు పరిశీలించారు. దీనిని అనుమానస్పద మృతిగా అనుకోవట్లేదు."

-- యత్తన సిరిసోంబా, కొ సముయ్​ బో పోలీస్​స్టేషన్​ సూపరిండెంట్​

షేన్​ వార్న్​ తన స్నేహితులతో కలిసి థాయ్​లాండ్​లోని కొ సముయ్​ ఐస్​లాండ్​కు వచ్చారని స్థానిక పోలీసులు తెలిపారు. 5 గంటల సమయంలో వార్న్​ అచేతనంగా ఉండటం వల్ల అంబులెన్స్ సీపీఆర్​ ప్రారంభించినట్లు అతడి సిబ్బంది స్టేట్​మెంట్​ విడుదల చేసింది.

ఇదీ చదవండి:వార్న్‌ చివరి క్షణాల్లో ఏం చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details