Aus vs SL captain Shanaka: క్రికెట్లో విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. అప్పటివరకు గెలుపు సాధిస్తుందనుకున్న జట్టు అనూహ్యంగా ఓటమి పాలవొచ్చు.. ఓడిపోతుందనుకున్న టీమ్ అద్భుత విజయం అందుకోవచ్చు. అయితే ఇలాంటి సంఘటనే ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
షనక వీరబాదుడు..దసున్ షనక కెప్టెన్సీలో ఈ ఏడాది ఆడిన 10 మ్యాచుల్లో తొమ్మిది ఓడింది శ్రీలంక. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20ల్లోనూ ఓడి సిరీస్ కోల్పోయింది. ఇక నామమాత్రంగా ఆడే మూడో టీ20లోనూ 177 పరుగుల చేధనకు బరిలో దిగిన ఆ జట్టు 108 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అప్పటికి ఇంకా 26 బంతుల్లో 69 పరుగులు చేయాలి. దాదాపు ఇది అసాధ్యమే. దీంతో మరో ఓటమి ఖాయం అనుకున్నారంతా. ఆసీస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా గెలుపు తన రూటు మార్చింది. అప్పటివరకు వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొన్న షనక.. అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. దీంతో ఒంటిచేత్తో తమ జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు.