తెలంగాణ

telangana

ETV Bharat / sports

శభాష్​ షమీ - ఒక్క పనితో మనసు గెలిచేశావ్!

Shami Saved Life : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ.. మంచి మనసు చాటుకున్నాడు. అదుపుతప్పి లోయలో పడ్డ కారులో నుంచి ఓ వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీశాడు.

shami saved life
shami saved life

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 10:42 AM IST

Updated : Nov 26, 2023, 11:22 AM IST

Shami Saved Life :టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ.. మంచి మనసు చాటుకున్నాడు. శనివారం అర్ధరాత్రి ఉత్తరాఖండ్ నైనిటాల్ సమీపంలో, తన ముందు నుంచి వెళ్తున్న కారు.. అదుపుతప్పి లోయలో పడింది. దీంతో షమీ వెంటనే తన కారును ఆపి.. వాహనదారుల సహాయంతో వారిని బయటకు తీశాడు. ఈ వీడియోను షమీ.. తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. " అతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి రెండో జన్మనిచ్చాడు. నైనిటాల్ సమీపంలో తన కారు నా ముందే, లోయలో పడింది. మేము అతడిని సేఫ్​గా బయటకు తీశాం. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు" అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు 'షమీ భాయ్ నువ్వు గ్రేట్', 'దేవుడే నిన్ను పంపాడు', ' గ్రేట్ జాబ్​ భయ్యా' అంటూ షమీని ప్రశంసిస్తున్నారు.

Shami World Cup 2023 :ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో షమీకి వరల్డ్​కప్ తుది జట్టులో ఛాన్స్ వచ్చింది. అలా టోర్నెమెంట్​ లీగ్​ దశలో నాలుగు మ్యాచ్​లు ముగిశాక న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో షమీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే ఆ మ్యాచ్​లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు షమీ. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్​లో 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.

సెమీఫైనల్​లో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి షమీ రికార్డు సృష్టించాడు. దీంతో వన్డేల్లో టీమ్ఇండియా తరఫున సింగిల్ మ్యాచ్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు. ఆ తర్వాత ఆదివారం జరిగిన ఫైనల్​లో పెద్దగా ప్రభావం చూపని షమీ.. కేవలం ఒకే వికెట్ దక్కించుకున్నాడు. ఈ వరల్డ్​కప్​లో మొత్తం 24 వికెట్లు తీశాడు. దీంతో టోర్నీలోనే అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్​గా షమీ.. బెస్ట్ బౌలర్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుత ఆసీస్ టీ20 సిరీస్​కు సెలెక్టర్లు షమీకి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.

'విరాట్, రోహిత్ టీ20ల్లోనూ ఆడాలి - లేదంటే వారి ఫేర్​వెల్ బాధ్యత హార్దిక్​దే' : షోయబ్

అండర్-19 ఆసియా కప్ 2023 జట్టును ప్రకటించిన బీసీసీఐ- HCA​ నుంచి ఇద్దరు

Last Updated : Nov 26, 2023, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details