Shami Mini Stadium :టీమ్ఇండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. దీంతో గత నాలుగు రోజులుగా దేశంలో షమీ పేరు మార్మోగిపోతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని షమీ సొంత గ్రామంలో మినీ స్టేడియం, ఓపెన్ జిమ్ నిర్మించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అమ్రోహ జిల్లా కలెక్టర్ రాజేశ్ త్యాగి ప్రకటన చేశారు.
"మహమ్మద్ షమీ సొంత గ్రామం సాహస్‌పుర్ అలీనగర్‌లో మినీ స్టేడియం, ఓపెన్ జిమ్ నిర్మించేందుకు నిర్ణయించాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. మినీ స్టేడియం నిర్మించడానికి అనువైన స్థలాన్ని గుర్తించాం" అని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో 20 మినిస్టేడియాలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఆదేశాలు ఇచ్చిందని.. అందులో అమ్రోహ జిల్లా కూడా ఉందని ఆయన అన్నారు. ఈ స్టేడియం నిర్మించడానికి ఎంపిక చేసిన స్థలాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు.
30 డేస్ విత్ షమీ..షమీ స్నేహితుల్లో ఒకరైన కాన్పుర్ ఎమ్మెల్యే.. ఉమేశ్ శర్మ అతడిపై బుక్ రాయనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకంలో షమీ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు, అతడిపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు, కుటుంబ నేపథ్యం లాంటి అంశాలు ఉంటాయని ఉమేశ్ అన్నారు. ఈ పుస్తకం '30 డేస్ విత్ షమీ' పేరుతో త్వరలోనే రానున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.