తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాచ్ ఓడినా.. బంగ్లా ఆల్​రౌండర్ షకీబ్ రికార్డు - shakib t20 world cup

బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకీబ్​ అల్ హసన్(shakib al hasan news) అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత సొంతం చేసుకున్నాడు.

Shakib breaks Malinga's record
షకిబ్ అల హాసన్

By

Published : Oct 18, 2021, 8:13 AM IST

బంగ్లాదేశ్​ స్టార్​ ఆల్​రౌండర్ షకీబ్ అల్ హసన్(shakib al hasan stats) మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్​లో(t20 world cup 2021 team list) భాగంగా ఆదివారం స్కాట్లాండ్​తో మ్యాచ్​లో రెండు వికెట్లు తీసి శ్రీలంక మాజీ స్టార్ పేసర్ లసిత్ మలింగను (84 మ్యాచుల్లో 107 వికెట్లు) అధిగమించాడు.

2006లో అరంగేట్రం చేసిన షకీబ్(shakib al hasan news).. 89 టీ20ల్లో 108 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్​ జరిగినా ఏడు సీజన్​లలోనూ బంగ్లాదేశ్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఆదివారం నాటి క్వాలిఫైయింగ్ మ్యాచ్​లో పసికూన స్కాట్లాండ్​ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది బంగ్లా(bangladesh news). బౌలర్లు రాణించినా.. బంగ్లా బ్యాట్స్​మన్​ ఘోరంగా విఫలమయ్యారు.

షకిబ్ అల హాసన్

మొదట బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ జట్టులో క్రిస్‌ గ్రీవ్స్‌ (45), మున్సే(29), మార్క్‌ వాట్‌(22) రాణించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మహేది హసన్‌ మూడు, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షకిబ్ తలో రెండు వికెట్లు తీశారు.

141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో బంగ్లా జట్టు 6 పరుగుల తేడాతో పసికూన స్కాట్లాండ్‌పై ఓడింది. ముష్‌ఫికర్‌ రహిమ్‌(38) రాణించగా, షకిల్‌ అల్‌ హసన్‌(20), మహ్మదుల్లా(23) ఫర్వాలేదనపించారు. మిగతా స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్లీ వీల్‌ మూడు వికెట్లు, క్రిస్‌ గ్రీవ్స్‌ రెండు, జోష్‌ డేవి, మార్క్‌ వాట్‌ తలో వికెట్‌ తీశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details