స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హాసన్(96*) విరోచిత పోరాటంతో జింబాబ్వేతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ గెలిచింది. మూడు వికెట్లు తేడాతో మ్యాచ్‌లో విజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50ఓవర్లలో 240/9 పరుగులు చేసింది. మధెవెరె(56), సారథి బ్రెండన్ టేలర్(46) తప్ప మిగతావారు రాణించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్లామ్ 4, షకీబ్ 2, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్, మెహదీ హాసన్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో బంగ్లా తడబడింది. 145 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే షకీబ్ టెయిలెండర్ల సహకారంతో జింబాబ్వేపై ఎదురుదాడికి దిగి జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తంగా 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది బంగ్లా.
పాక్ జట్టుపై ఇంగ్లాండ్ గెలుపు