దేశవాళీ టీ20 లీగ్‌లో భాగంగా ఫీల్డ్ అంపైర్‌తో అమర్యాదగా ప్రవర్తించిన బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్‌పై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.
షకిబుల్ హసన్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం! - ఢాకా ప్రీమియర్ లీగ్
బంగ్లా దేశవాళీ టీ20 లీగ్‌లో అతిగా ప్రవర్తించిన బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్‌పై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. అతడిని లీగ్ నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

షకిబుల్ హసన్, ఢాకా ప్రీమియర్ లీగ్
ఢాకా టీ20 లీగ్‌లో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ షకిబుల్ ఫీల్డ్‌లో అనుచితంగా ప్రవర్తించాడు. వికెట్లను తన్నడమే కాకుండా వాటిని తీసి గ్రౌండ్‌కేసి కొట్టాడు. అంపైర్తోనూ వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించనున్నట్లు.. అతడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్ ఛైర్మన్ మసూదుజ్జమన్ తెలిపారు.
ఇదీ చదవండి:అంపైర్‌తో షకిబుల్ వాగ్వాదం.. వీడియో వైరల్
Last Updated : Jun 12, 2021, 11:11 PM IST