న్యూజిలాండ్ జట్టుతో త్వరలో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు(rohit sharma captain t20) నాయకత్వ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(shahid afridi news) స్పందిస్తూ.. రోహిత్‌కు బాధ్యతలు అప్పగించడం వల్ల విరాట్ కోహ్లీ(virat kohli captaincy news) మరింత కాలం బ్యాటర్‌గా రాణిస్తాడని పేర్కొన్నాడు. కోహ్లీ సేవలు టీమ్ఇండియాకు చాలా అవసరమని.. అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుంటే తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని సూచించాడు.
'రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చి కోహ్లీ బ్యాటర్‌గా కొనసాగాలి' - షాహిద్ అఫ్రిది విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా కెప్టెన్సీ మార్పు సరైనదే అని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(shahid afridi news). కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి సారథిగా తప్పుకొని బ్యాటర్‌గా కొనసాగాలని సూచించాడు.
"టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్లకు నాయకత్వం వహించడమనేది చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. జట్టు రాణిస్తున్నంత కాలం అందరూ పొగుడుతూనే ఉంటారు. ఒకవేళ విఫలమైతే అభిమానులు జీర్ణించుకోలేరు. సారథ్య బాధ్యతలను మోస్తూ కోహ్లీ(virat kohli captaincy news) బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుని.. ఆటగాడిగా కొనసాగాలి. నాణ్యమైన బ్యాటర్‌గా అతడి సేవలు టీమ్ఇండియాకు చాలా అవసరం. అతడిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది" అని అఫ్రిది(shahid afridi news) పేర్కొన్నాడు.
"నేను ఐపీఎల్‌లో (దక్కన్ ఛార్జర్స్ తరఫున) ఆడినప్పుడు రోహిత్ శర్మ(rohit sharma captain t20) ఆటను చాలా దగ్గర్నుంచి గమనించా. అతడు గొప్ప బ్యాట్స్‌మన్. షాట్ల ఎంపిక గొప్పగా ఉంటుంది. అతడు జట్టు అవసరాలను బట్టి దూకుడుగాను ఆడగలడు. క్లిష్టపరిస్థితుల్లో నిలకడగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చగలడు. టీమ్ఇండియా కెప్టెన్సీ మార్పు సరైనదే. రోహిత్‌కు ఓ అవకాశం ఇవ్వాలి" అని అఫ్రిది(shahid afridi news) సూచించాడు.