తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్ బ్యాట్​తో పాక్ క్రికెటర్ ఫాస్టెస్ట్ సెంచరీ - fastest ever ODI century

సచిన్ బ్యాట్​తో​ పాక్ బ్యాట్స్​మన్ ఒకరు వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేశాడు. అయితే ఈ విషయం చాలా ఏళ్ల క్రితమే జరిగింది. ఇంతకీ ఆ శతకం కొట్టిన పాక్ క్రికెటర్ ఎవరు? ఏ జట్టుపై ఈ ఘనత సాధించాడు?

Shahid Afridi used Sachin Tendulkar's bat to hit the fastest ever ODI century
సచిన్

By

Published : May 24, 2021, 6:23 PM IST

దిగ్గజ సచిన్​ తెందూల్కర్​ రికార్డుల గురించి, క్రికెట్​లో అతడు సాధించిన ఘనతలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటిది సచిన్ బ్యాట్​తో పాక్ క్రికెటర్​ వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేశాడంటే నమ్మగలరా? అవునా అని ఆశ్చర్యపోకండి.

షాహీద్ అఫ్రీది

1996లో పాక్ జట్టులోకి షాహీద్ అఫ్రిది అరంగేట్రం చేసినప్పుడు అతడి దగ్గర సరైన బ్యాట్​ కూడా లేదు. దీంతో అప్పటి కెప్టెన్ వకార్ యూనిస్.. కెన్యాతో మ్యాచ్​ సందర్భంగా తన దగ్గరున్న సచిన్ బ్యాట్​ను అతడికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మ్యాచ్​లో రెచ్చిపోయిన యువ అఫ్రిది.. ఏకంగా 37 బంతుల్లో సెంచరీ చేసి, అప్పట్లో వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఇతడి ఇన్నింగ్స్​లో 11 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి.

అయితే తర్వాత కాలంలో ఆ రికార్డును కోరె అండర్స్-న్యూజిలాండ్(36 బంతుల్లో), ఏబీ డివిలియర్స్(31 బంతుల్లో) అధిగమించారు.

ఇది చదవండి:రెండు జట్లతో టీమ్ఇండియా ప్రయోగం.. కొత్తేం కాదు!

ABOUT THE AUTHOR

...view details