టీమ్ఇండియా యువ బ్యాటర్ షెఫాలీ వర్మ అండర్-19 మహిళల జట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటుగా ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ జట్టు కెప్టెన్‌గా షెఫాలీ వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. శ్వేతా సెహ్రావత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా గోష్ సైతం జట్టులో స్థానం సంపాదించింది.
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా తొలి ఎడిషన్‌లో 16 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరి 14 నుంచి 29 వరకు జరగనుంది. గ్రూప్- డిలో టీమ్‌ఇండియాతో పాటు దక్షిణాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్ ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి టాప్ 3లో నిలిచిన జట్లు సూపర్ 6 రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తాయి. ప్రతి గ్రూపు నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జనవరి 27న జరగనున్న సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.
దక్షిణాఫ్రికాతో టీ20కి ఎంపికైన జట్టు:
షెఫాలీ వర్మ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్(వైస్ కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), గొంగడి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెహ్దియా, హర్లీ గాలా, హర్షితా బసు(వికెట్ కీపర్), సోనం యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, పర్షవి చోప్రా, టిటాస్ సధు, ఫలక్ నాజ్, షబ్నమ్ ఎండీ, షికా, నజ్లా, యశశ్రీ.