Shadab Khan On Babar Azam : పాకిస్థాన్ క్రికెట్ జట్టులో విభేదాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. కెప్టెన్ బాబర్ అజామ్‌తో జట్టులోని మిగతా ప్లేయర్లకు విభేధాలు వస్తున్నాయని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆసియాకప్-2023 లీగ్ దశలో మంచిగా రాణించిన పాకిస్థాన్.. సూపర్-4లో ఓటమితో అనుహ్యంగా టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే ఈ టోర్నీలో కెప్టెన్‌గా బాబర్ అజామ్ తీసుకున్న నిర్ణయాలపై కొంత మంది ప్లేయర్స్ ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు వర్గాలు.. పాక్ జట్టు డ్రెసింగ్ రూమ్‌లో రెండు వర్గాలు ఉన్నాయని అంటున్నారు. కొంతమంది బాబర్ కెప్టెన్సీని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారని వార్తల వస్తున్నాయి. లంకపై ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ - స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా బాబర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడట.
Shadab Khan Statement : ఇక బాబర్‌పై పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కీలక వ్యాఖ్యలు చేశాడు. "ఫీల్డ్‌లో బాబర్ అజామ్‌తో ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే అతడు మైదానంలో పూర్తి భిన్నంగా ఉంటాడు. కానీ ఆఫ్ ది ఫీల్డ్‌లో మాత్రం అతడితో మేము బాగానే ఉంటాం" అని షాదాబ్ పేర్కొన్నట్లు ఇంగ్లీష్ కథనాలు పేర్కొంటున్నాయి.