తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 worldcup: టీమ్​ఇండియాకు చేదు అనుభవం.. ఆహారాన్ని తిరస్కరించిన ప్లేయర్స్​ - టీ20 వరల్డ్​ కప్​ భారత ప్లేయర్లకు చల్లని భోజనం

టీ20 ప్రపంచకప్​లో భాగంగా నెదర్లాండ్స్​తో మ్యాచ్​ కోసం సిడ్నీ వెళ్లిన టీమ్​ఇండియాకు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఏర్పాటు చేసిన ఫుడ్​ మెనుపై ప్లేయర్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహారం సరిగా లేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

Indian cricketers opt to eat at hotel
Indian cricketers opt to eat at hotel

By

Published : Oct 26, 2022, 3:49 PM IST

టీ20 ప్రపంచ కప్​లో భాగంగా పాకిస్థాన్​పై అపురూప విజయం సాధించి.. తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న టీమ్​ఇండియా అక్కడి భోజన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం నెదర్లాండ్‌పై మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్ సెషన్​లో పాల్గొంది. అనంతరం మధ్యాహ్న భోజనంగా తమకు కోల్డ్​ సాండ్​విచెస్​(చల్లటివి) అందించడంపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ప్లేయర్స్​ ఆ ఆహారాన్ని తినకుండా అలానే వదిలేశారు.

"ఇది బాయ్​కాట్​ కాదు. కొంతమంది ప్లేయర్స్​ ఫ్రూట్స్​ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే వాళ్లు తిరిగి తమ హోటల్​కు వెళ్లి తిన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఐసీసీ.. లంచ్​లో హాట్​ ఫుడ్​ను ఏర్పాటు చేయలేదు. ద్వైపాక్షిక సిరిస్​లో, ఆతిథ్యం ఇచ్చే బోర్డులు భోజనానికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటుంది. లంచ్​లో వారెప్పుడూ ట్రైనింగ్ సెషన్ తర్వాత వేడివేడిగా ఇండియన్​ మీల్స్(భారతీయ వంటకాలు)​ మాత్రమే ఏర్పాటు చేస్తారు. కానీ ఐసీసీ అలా కాదు. అని జట్లకు ఒకటే నిబంధన పాటిస్తుంది. ఒకేరకమైన ఫుడ్​ మెనును ఏర్పాటు చేస్తుంది. అయితే రెండు గంటల పాటు శిక్షణ చేసి అలసిపోయిన మన ఆటగాళ్లు చల్లని సాండ్​విచ్​లు తినడానికి తిరస్కరించారు. అయినా అందులో సరైన పోషకాలు కూడా ఉండవు." ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

అయితే ఈ సమస్య ఐసీసీ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఓ ఐసీసీ అధికారి మాట్లాడుతూ.. అవును, భారత జట్టు ప్రాక్టీస్​ తర్వాత పెడుతున్న ఫుడ్ మెనుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చింది. త్వరలోనే దీనికి పరిష్కారం చూస్తాం." అని అన్నారు.

ఇవీ చదవండి :'ఐపీఎల్ నా ఆట తీరు మార్చేసింది.. టోర్నీ వల్ల చాలా మెరుగయ్యా'

'టీమ్​ఇండియాకు నయా జహీర్ ఖాన్'.. అర్ష్​దీప్​పై మాజీ కోచ్ కామెంట్స్

ABOUT THE AUTHOR

...view details