టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot singh sidhu news) తన పిల్లల్ని బోర్డర్‌కు పంపాలని మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్(Gautam gambhir on navjot singh sidhu) డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సిద్ధూ తన పెద్దన్నగా సంబోధించిన నేపథ్యంలో గౌతీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"పాక్ అండదండలతో చెలరేగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ 70 ఏళ్లుగా పోరాడుతుంటే.. దానికి సహకరిస్తున్న దేశాధినేతను పట్టుకొని 'పెద్దన్న'గా పేర్కొనడం సిగ్గుచేటు. నీ కుమారుడు లేదా కూతుర్ని బోర్డర్‌కు పంపిన తర్వాతే ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఆ దేశాధినేతను పెద్దన్న(Sidhu imran khan) అని పిలుచుకో. ఇది చాలా దారుణమైన విషయం"