తెలంగాణ

telangana

ETV Bharat / sports

లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ సీజన్​ 2 షెడ్యూల్​ రిలీజ్​, వేదికలు ఇవే - లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ షెడ్యూల్​

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్ల కోసం నిర్వహించే లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టోర్నీ నిర్వాహకులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మ్యాచులు నిర్వహిస్తామని తెలిపారు.

LLC Tournament Schedule
LLC Tournament Schedule

By

Published : Aug 24, 2022, 7:19 AM IST

LLC Tournament Schedule: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్ల కోసం నిర్వహించే లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్ఎల్‌సీ) టోర్నమెంట్‌ రెండో ఎడిషన్‌ సిద్ధమైంది. ఆరు నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఇండియన్ మహారాజ్‌, వరల్డ్‌ జెయింట్స్‌ జట్ల మధ్య ప్రత్యేక మ్యాచ్‌ జరగనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌, జోధ్‌పుర్, లఖ్​నవూ, దిల్లీ, కటక్‌ నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయని లీగ్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ రామన్‌ రహేజా తెలిపారు. సెప్టెంబర్‌ 16 నుంచి రెండో ఎడిషన్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు. లీగ్‌ దశ మ్యాచ్‌లకు వేదికలను ఖరారు చేయగా.. ప్లేఆఫ్స్‌, ఫైనల్‌కు స్టేడియాలను ఇంకా నిర్ణయించలేదు.

"దిగ్గజాల క్రికెట్‌ను మళ్లీ వీక్షించేందుకు వేచి ఉన్న అభిమానులు, ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి. షెడ్యూల్‌ను విడుదల చేశాం. ఆన్‌లైన్‌లో టికెట్లకు సంబంధించి త్వరలోనే వెల్లడిస్తాం. దాదాపు పది దేశాల నుంచి గుర్తింపు పొందిన టాప్‌ మాజీ ప్లేయర్లు కొత్త ఫార్మాట్‌లో ఆడబోతున్నారు. తప్పకుండా అభిమానులకు నచ్చుతుందని భావిస్తున్నా. అయితే పాకిస్థాన్‌ నుంచి ఎవరినీ తీసుకురావడం లేదు. త్వరలో మరికొందరిని చేరుస్తాం. దిగ్గజ క్రికెటర్లు ఒక్క మ్యాచ్‌ను మిస్‌ కాకుండా ఆడతారు. ఫైనల్‌ మ్యాచ్‌ను డెహ్రాడూన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం" అని రామన్ రహేజా వివరించారు. అభిమానులను అలరించేందుకు మరోసారి దిగ్గజ క్రికెటర్లతో కలిసి వస్తున్నామని లీగ్ కమిషనర్‌ రవిశాస్త్రి తెలిపాడు. ఈసారి లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్‌ సింగ్‌, పఠాన్‌ బ్రదర్స్‌, షేన్‌ వాట్సన్‌ తదితరులు పాల్గొంటున్నారు.

మ్యాచుల వివరాలు..

  • కోల్‌కతా: సెప్టెంబర్‌ 16 నుంచి 18 వరకు (మూడు మ్యాచ్‌లు)
  • లఖ్​నవూ: సెప్టెంబర్ 21, 22 (రెండు మ్యాచ్‌లు)
  • దిల్లీ: సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు (మూడు మ్యాచ్‌లు)
  • కటక్‌: సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు (నాలుగు మ్యాచ్‌లు)
  • జోధ్‌పుర్‌: అక్టోబర్‌ 1, అక్టోబర్‌ 3 (రెండు మ్యాచ్‌లు)
  • ప్లేఆఫ్స్‌: అక్టోబర్‌ 5, అక్టోబర్‌ 7 (వేదికలు ఖరారు కాలేదు)
  • ఫైనల్‌ మ్యాచ్‌: అక్టోబర్ 8 (వేదిక ఖరారు కాలేదు)

ఇవీ చదవండి:వినోద్‌ కాంబ్లీకి వ్యాపారవేత్త జాబ్‌ ఆఫర్, భారీగా వేతనం

కోహ్లీ పరుగుల దాహం ఇంకా తీరలేదు, ఆ ఒక్క పనిచేస్తే నోళ్లన్నీ మూతపడతాయి

ABOUT THE AUTHOR

...view details