IND VS IRE: భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్ పర్యటన ఖరారైంది. ఆతిథ్య జట్టుతో రెండు టీ20లు ఆడనుంది టీమ్ఇండియా. మలహైడ్ వేదికగా ఈ ఏడాది జూన్ 26, 28 తేదీల్లో ఈ సిరీస్ జరగనుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ వెల్లడించింది.
ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, పంత్, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన ఒక టెస్టు కూడా ఈ ఏడాది జులైలో జరగనుంది.