తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగాల్​పై ఘన విజయం.. రెండో సారి రంజీ ట్రోఫీని ముద్దాడిన సౌరాష్ట్ర

దేశవాళీ రంజీ ట్రోఫీ- 2023 టైటిల్​ను సౌరాష్ట్ర టీమ్​ సొంతం చేసుకుంది. కోల్​కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో బెంగాల్​ టీమ్​ను చిత్తు చేసి సౌరాష్ట్ర రెండోసారి టైటిల్​ను ఎగరేసుకునిపోయింది.

ranji trophy 2023
ranji trophy 2023

By

Published : Feb 19, 2023, 12:40 PM IST

కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​లో సౌరాష్ట్ర టీమ్​ విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో బంగాల్‌ను ఓడించి రెండోసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది.
మూడో రోజు ఓవర్​నైట్​ స్కోర్​ 169-4తో ఫైనల్​ గేమ్​ను ప్రారంభించిన బంగాల్​.. 241 పరుగులకే ఆలౌటయ్యింది. ఇక ఆ జట్టును కాపాడుకునేందుకు కెప్టెన్​ మనోజ్​ తివారీతో పాటు షాబాజ్​ అహ్మద్​ రంగంలోకి దిగినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించేందుకు విఫలమై నిరాశతో పెవిలియన్​ దారి పట్టారు. దీంతో 14 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 2.4 ఓవర్లలోనే ఛేదించింది.

మొదటి సారి 2019-20లో టైటిల్​ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. అప్పుడు కూడా ప్రత్యర్థిగా బంగాల్​ టీమ్​ కావడం విశేషం. కాగా రంజీల్లో ఇది బంగాల్​కు 15వ ఫైనల్ కాగా.. 13 సార్లు ఆ జట్టు​ రన్నరప్​గానే నిలిచింది. మరోవైపు సౌరాష్ట్ర టీమ్​ కెప్టెన్​గా ఉనద్కత్​ తన ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. 2019-20లోనూ సౌరాష్ట్రకు సారధ్యం వహించిన ఉనద్కత్..​ తొలి రంజీ ట్రోఫీని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన విజయ్​ హజారే ట్రోఫీలోనూ సౌరాష్ట్ర టీమ్​ గెలుపొందింది.

ABOUT THE AUTHOR

...view details