తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ స్కోరెంత? కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడు?- సీరియస్​ మీటింగ్​లోనూ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ వరల్డ్​కప్ అప్డేట్స్!

Satya Nadella World Cup Updates : ఓపెన్ ఏఐపై సీరియస్​ మీటింగ్​లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సత్య నాదెళ్ల.. వరల్డ్​ కప్​ ఫైనల్​ అప్డేట్స్​ కూడా ఫాలో అయ్యారు. మీటింగ్ మధ్యలో కోహ్లీ ప్రదర్శన గురించి సభ్యులకు అప్డేట్స్ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం.

Satya Nadella  World Cup Updates
Satya Nadella World Cup Updates

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 3:47 PM IST

Updated : Dec 2, 2023, 4:08 PM IST

Satya Nadella World Cup Updates :ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​లో భారత్​ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి టైటిల్ గెలిచింది. అయితే ఇప్పటికీ ఆ మెగా టోర్నీకి సంబంధించిన ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ రాసిన ఓ ఆర్టికల్​లో వరల్డ్​కప్​ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ప్రస్తావించింది.

వరల్డ్​ కప్​ సమయంలో వ్యాపారులు, సినీ తారల దగ్గరనుంచి సాధారణ ప్రజల వరకు ఉత్కంఠతో టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయారు. ఎవరు గెలుస్తారో అని ఆసక్తిగా మ్యాచ్​ను చూశారు. ఇక ఆ సమయంలో ముఖ్యమైన పనుల్లో బిజీ అయిపోయినవారి ఆలోచన కూడా మ్యాచ్​ పైనే ఉంది. ప్రముఖ టెక్​ దగ్గజం మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్ సత్య నాదెళ్లకు క్రికెట్​ అంటే ప్రాణం. వరల్డ్ కప్​ ఫైనల్​ సమయంలో ఆయన ఓపెన్ ఏఐ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంటెన్స్​ మీటింగ్​లో ఉన్నారు. ఆ సమయంలోనూ ఫైనల్​ అప్డేట్స్​​ ఆయన మిస్​ కాలేదట. ఆ మీటింగ్​లో పాల్గొన్న సభ్యుల టెన్షన్ పోగొట్టేందుకు వరల్డ్ కప్ ఫైనల్​లో విరాట్​ కోహ్లీ ప్రదర్శన గురించి అప్డేట్స్ ఇచ్చారట నాదెళ్ల. ఆ న్యూస్ ఆర్టికల్​కు సంబంధించిన ఫొటో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.

రాత్రంతా మేలుకుని మ్యాచ్ చూశా! : సత్య నాదెళ్ల
2023 వరల్డ్​ కప్​లో భాగంగా న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను రాత్రంతా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇటీవల ఓ పాడ్​కాస్ట్​ ఇంటర్వ్యూవలో సత్య నాదెళ్ల తెలిపారు. పాడ్​కాస్ట్​లో సత్య నాదెళ్ల మాట్లాడుతుండగా.. షో వ్యాఖ్యాత​ వరల్డ్‌ కప్‌ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత టీమ్ఇండియా ఓటమిని గుర్తుచేసి.. ఆ ఓటమికి ప్రతీకారంగా 'ఆస్ట్రేలియాను కొంటారా?' అని సరదాగా ప్రశ్నించారు. దీనిపై సత్య నాదెళ్ల స్పందించారు. ఆస్ట్రేలియాను కొనడం అంటే ఓపెన్‌ఏ ఐను సొంతం చేసుకోవడం లాంటిదేనని.. ఆ రెండూ సాధ్యం కావని నవ్వుతూ బదులిచ్చారు. కానీ, ఓపెన్‌ ఏఐతో తాము భాగస్వాములం కాగలమని అన్నారు. అలాగే ఆస్ట్రేలియా క్రికెట్‌ ఆడడాన్నీ ఆనందించగలమని అని సరదాగా బదులిచ్చారు.

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్​- న్యూజిలాండ్​పై 150 పరుగుల తేడాతో ఘన విజయం

వారం రోజుల్లో డబ్ల్యూపీఎల్ వేలం- 165 మందిలో అదృష్టం వరించేది​ ఎవరినో?

Last Updated : Dec 2, 2023, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details