తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూర్యపై సర్ఫరాజ్​ షాకింగ్​ కామెంట్స్.. ఏమన్నాడంటే? - ఇండియన్​ క్రికెట్ టీమ్​

సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్‌ ఖాన్.. ఇటీవల కాలంలో వీరిద్దరి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికపై కామెంట్ల వర్షం కురుస్తోంది. తాజాగా సూర్యకుమార్‌ను ఎంపిక చేయడంపై సర్ఫరాజ్‌ స్పందించాడు.

indian cricket team
indian cricket team

By

Published : Jan 24, 2023, 3:19 PM IST

ఇటీవల రంజీ ట్రోఫీలో సెంచరీలతో అదరగొట్టిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక అవుతాడని చాలా ఆశపడ్డాడు. కానీ అతడికి జట్టులో స్థానం దక్కలేదు. దీంతో సోషల్‌ మీడియాలో టీమ్‌ ఎంపికపై తీవ్ర విమర్శలు రేగాయి. చీఫ్ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ కమిటీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశాడు. కేవలం సన్నగా ఉంటేనే ఎంపిక చేస్తారా..? అంటూ ప్రశ్నించాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్‌కు బదులు సూర్యకుమార్‌ యాదవ్‌ను మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేసింది. ఈ క్రమంలో సూర్యకుమార్‌ ఎంపికపై కూడానూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన సర్ఫరాజ్‌ను కాదని సూర్యను తీసుకోవడం సరైంది కాదని చర్చకు తెరతీశారు. ఈ క్రమంలో సూర్యపై సర్ఫరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరూ ముంబయి తరఫున చాలా మ్యాచుల్లో కలిసి ఆడారు.

"సూర్య ఎంతో మందికి స్ఫూర్తివంతమైన ఆటగాడు. నాకు ఎంతో మంచి స్నేహితుడు. ఒకే జట్టు తరఫున ఆడినప్పుడు చాలా సమయం మేమిద్దరం కలిసిమెలిసి తిరిగాం. అతడి నుంచి చాలా నేర్చుకొన్నా. సూర్య కూడా జట్టులో స్థానం కోసం చాలాకాలం నుంచి వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు తన అనుభవం మొత్తం వినియోగించుకొని అదరగొట్టేస్తున్నాడు. ఇప్పుడు నా దృష్టంతా కష్టపడటం మీదనే ఉంది. సాధ్యమైనంత కష్టపడి ఎప్పటికైనా ఫలితం రాబట్టొచ్చనే నమ్మకం ఉంది. నేను ఎప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లినా సరే.. గత కొన్నేళ్లుగా ఎలా రాణిస్తున్నానో అలానే ఆడతా. మైదానంతో నా అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. అందుకే ఎక్కువగా సాధన చేసి ఫామ్‌ను కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా" అని సర్ఫరాజ్‌ తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details