తెలంగాణ

telangana

ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌.. బ్రాడ్​మన్​ తర్వాత అతడే.. భారత్​లో టాప్! - రంజీట్రోఫీ సర్ఫరాజ్​ ఖాన్​ రికార్డులు

Ranji Trophy Sarfaraj Khan: రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు ముంబయి జట్టు బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ సీజన్​లోనూ పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ.. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లో అత్యధిక సగటు నమోదు చేసిన భారత క్రికెటర్​గా నిలిచాడు.

sarfaraz khan
sarfaraz khan

By

Published : Jun 7, 2022, 5:27 PM IST

Ranji Trophy Sarfaraj Khan: రంజీ ట్రోఫీలో ముంబయి బ్యాటర్​ సర్ఫరాజ్​ ఖాన్​ పరుగుల వరద కొనసాగుతోంది. క్వార్టర్‌ ఫైనల్లో ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో సెంచరీ సాధించాడు సర్ఫరాజ్​. రంజీల్లో అతడికిది ఏడో సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్‌కు ముందు జరిగిన లీగ్‌ స్టేజ్‌లోనూ టాప్‌ ఫామ్‌లో ఉన్న అతడు.. ఇప్పుడు నాకౌట్‌ దశలోనూ దంచికొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 153 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లోనే 704 పరుగులు చేశాడు సర్ఫరాజ్​.

2019-20 సీజన్‌ నుంచి సర్ఫరాజ్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్​ల్లోనే అతడు ఏకంగా 928 పరుగులు తీశాడు. అందులో ఒక ట్రిపుల్‌ సెంచరీ(301*) కూడా ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఆల్‌టైమ్‌ గ్రేట్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ (సగటు 95.14) తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక సగటు సర్ఫరాజ్‌దే (80.42). అంటే అతడు ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ విజయ్ మర్చంట్​ను (71.64) అతడు అధిగమించాడు. అయితే ఈ స్థాయిలో పరుగులు చేస్తున్నా ఇప్పటి వరకు టీమ్ఇండియా నుంచి మాత్రం అతడికి ఎలాంటి పిలుపురాలేదు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అతడ్ని వేలంలో కొనుగోలు చేసినా కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే ఆడటానికి అవకాశం ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details