టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. మంగళవారం శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ సమయంలో అతడి ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో శ్రీలంకతో జరిగే మిగిలిన టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇంతలోనే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో ప్లేయర్‌ను బీసీసీఐ ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలా తెరపైకి జితేశ్ శర్మ పేరు వచ్చింది. బుధవారం ఈ వార్తను ధ్రువీకరిస్తూ స్వయంగా బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో అందరి చూపు ఇప్పుడు జితేశ్‌పై పడింది.
సంజూ బ్యాడ్‌లక్.. గాయంతో టీ20 సిరీస్‌కు దూరం.. అతడి ప్లేస్‌లో మరో ప్లేయర్.. - సంజూ శాంసన్ లేటెస్ట్ అప్డేట్స్
లంకతో మంగళవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు మిగతా టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరొక ప్లేయర్‌ను బీసీసీఐ ఎంచుకుంది. అతడు ఎవరంటే ?
sanju samson
ఎవరీ జితేశ్ శర్మ ?
ఐపీఎల్ పంజాబ్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న జితేశ్ ఒకప్పుడు ముంబయి టీమ్ మెంబర్. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్ తొలి మ్యాచ్‌లోనే 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ 27 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ పంజాబ్ తరఫున ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 10 ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేశాడు.