Sanju Samson Australia Series : ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కుగానూ బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమ్‌ఇండియా ప్లేయర్ సంజు శాంసన్ ప్రస్థావనే రాలేదు. దీంతో అతనికి మళ్లీ నిరాశే ఎదురైంది. గతంలో ఆసియా కప్ టీమ్‌లోనూ రిజర్వ్ ప్లేయర్‌గా వచ్చినప్పటికీ.. మైదానంలో ఆడే అవకాశం దక్కలేదు. కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ తర్వాత సంజుకు ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోయింది.
తాజాగా జరిగిన ఆసియాకప్‌లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశారు. పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4లో కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ సాధించాడు. ఇలా వీరిద్దరి అద్భుత ప్రదర్శన పరిశీలిస్తే సంజూకు తిరిగి టీమ్‌ఇండియా జట్టులోకి రావడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగాఫ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజూ కమ్‌బ్యాక్‌కు అన్ని దారులు మూసుకుపోయాయంటూ ఆందోళన చెందుతున్నారు.
Sanju Samson ODI Career : ఇక సంజూ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే.. భారత జట్టు తరఫున సంజూ 13 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 390 పరుగులు చేశాడు. అప్పుడు సంజూ శాంసన్ సగటు 55.71 కాగా, అతని స్ట్రైక్ రేట్ 104గా ఉంది. అయితే ఇప్పటి వరకు సంజూ తన వన్డే ఫార్మాట్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. కానీ హాఫ్ సెంచరీ మార్క్‌ను మూడు సార్లు దాటాడు.