Sandeep Lamichhane Rape Case :ఓ మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో నేపాల్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచ్చెన్‌ను కాఠ్ మాండూ జిల్లా కోర్డు దోషిగా తేల్చింది. గతేడాది ఆగస్టులో కాఠ్ మాండూలోని ఓ హోటల్లో సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్ బాలిక కోర్టును ఆశ్రయించింది. దీంతో కొన్నాళ్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ పూర్తి చేసుకొని నేపాల్‌కు తిరిగి వచ్చిన సందీప్‌ను పోలీసులు ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో అతడ్ని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే హై కోర్టుకు వెళ్లి సందీప్ బెయిల్ తెచ్చుకున్నాడు. కాగా, తాజాగా కోర్టు అతడ్ని దోషిగా నిర్ధారించింది. శిశిర్ రాజ్ ధాకల్‌తో కూడిన ఓ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
తొలి నేపాల్ ప్లేయర్:సందీప్ లామిచెనె ఐపీఎల్లో ఆడిన తొలి నేపాల్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అతడు 2018లో దిల్లీ క్యాపిటల్స్ (అప్పటి దిల్లీ డేర్ డెవిల్స్) జట్టుతో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కెరీర్లో రెండు సీజన్లో ఆడిన సందీప్ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌తో పాటు సందీప్ బిగ్‌బాష్ లీగ్, పాకిస్థాన్ టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నాడు.