స్వలింగ వివాహంతో సర్వత్రా చర్చనీయాంశమైన ఆసీస్ క్రికెటర్ మేగాన్ స్కట్-జెస్ హోలియోక్ జంట ఓ శుభవార్త చెప్పింది. 2019 మార్చి 31న వివాహ బంధంతో ఒక్కటైన ఈ స్వలింగ జోడీ.. తమ బంధానికి గుర్తుగా ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వెల్లడించింది.
"తన జీవిత భాగస్వామి జెస్ గర్భవతి అనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపింది మేగాన్. జెస్, నేను చాలా సంతోషంగా ఉన్నాం. జెస్ త్వరలోనే పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వబోతోంది" అని పేర్కొంది.
గతంలో వారిద్దరి వివాహం సందర్భంగా మేగాన్.. "నా జీవితంలో ఇది అత్యుత్తమ రోజు. నా మనసు నిండుగా ఉంది. నేను చాలా అదృష్టవంతురాలిని" అని ట్వీట్ చేసింది.