తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు షాక్​.. ప్రపంచకప్​కు స్టార్​ ఆల్​రౌండర్​ దూరం - టీ20 ప్రపంచకప్

టీ20 వరల్డ్​కప్(T20 World Cup)​ ముందు ఇంగ్లాండ్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్​​ ఆల్​రౌండర్​ ఒకరు టోర్నీకి దూరమయ్యారు. ఐపీఎల్​లో ఓ మ్యాచ్​ సందర్భంగా గాయమే కారణం.

T20 World Cup
సామ్ కరన్

By

Published : Oct 5, 2021, 6:56 PM IST

టీ20 ప్రపంచకప్ (T20 World Cup)​ నుంచి వైదొలిగాడు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సామ్ కరన్ (Sam Curran). ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్​ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐపీఎల్​లో చెన్నై తరఫున మ్యాచ్​లో​ వెన్ను గాయం (Sam Curran Injury) కారణంగా అతడు తప్పుకున్నట్లు ఈసీబీ వెల్లడించింది.

మరికొన్ని రోజుల్లో సామ్.. ఇంగ్లాండ్ తిరిగి వెళ్లనున్నాడని, అక్కడ తదుపరి స్కానింగ్​లు తీయడం సహా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నాడని ఈసీబీ తెలిపింది.

అర్ధాంతరంగా ఐపీఎల్​ను (Sam Curran IPL) వీడటంపై విచారం వ్యక్తంచేశాడు కరన్. "దురదృష్టవశాత్తు ఐపీఎల్​ సహా ప్రపంచకప్​ను మిస్​ అవుతున్నా. మంచి సమయంలో చెన్నై జట్టును వీడటం బాధగా ఉంది. చెన్నై ఫ్యాన్స్​ మద్దతు మరవలేనిది. త్వరలోనే కలుస్తా." అని కరన్ చెప్పాడు.

ఇదీ చూడండి:'పాక్​తో భారత్ పోటీపడలేదు.. అందుకే మాతో ఆడట్లేదు'

ABOUT THE AUTHOR

...view details