ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్, పాక్ క్రికెటర్ సల్మాన్ బట్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వాన్ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాడని బట్ అన్నాడు. కొందరికి మానసిక అజీర్తి అనే రుగ్మత ఉంటుందని విమర్శించాడు. మాటలు, చేతలను బట్టే అతడి మూర్తిమత్వం ఏంటో తెలుస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించాడు. గతం గురించి మాట్లాడటంలో అర్థం ఏముందని ప్రశ్నించాడు. 2010లో బట్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నిషేధానికి గురయ్యాడు.
"వివరాల్లోకి వెళ్లను. వాన్ ఎంచుకున్న కోణం తప్పు. అతడు నన్ను విమర్శించడంలో అర్థం లేదు. నా గతం గురించి మాట్లాడటం స్థాయికి తగింది కాదు. అది దిగజారుడు తనమే! ఇంకా దాని గురించే మాట్లాడాలనుకుంటే అతనిష్టం. అజీర్తి ఓ రుగ్మత. లోపల ఉన్నవి అంత సులభంగా బయటకు రావు. కొందరికి మానసిక అజీర్తి ఉంటుంది. వారి బుద్ధి ఇంకా గతంలోనే ఉండిపోయింది. నేను వాటిని పట్టించుకోను" అని బట్ స్పందించాడు.