Salman Butt on Kohli Rohit: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్ శర్మకు.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు ప్రకటించడం పట్ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సంతోషం వ్యక్తం చేశాడు. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి జట్టు విజయాల కోసం నిరంతరం కృషి చేస్తానని విరాట్ ఇటీవల పేర్కొన్నాడు. తనకూ, రోహిత్ శర్మకు మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా స్పష్టం చేసినట్లు కోహ్లీ వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన అంశంపై కోహ్లీ వ్యవహరించిన తీరును సల్మాన్ మెచ్చుకున్నాడు. జట్టులో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొనసాగలాంటే రోహిత్‌కు విరాట్ మద్దతు తెలపడం ముఖ్యమని పాక్ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు.
ఇద్దరూ మ్యాచ్ విన్నర్లే