తెలంగాణ

telangana

By

Published : Aug 20, 2021, 10:20 PM IST

ETV Bharat / sports

'షారుఖ్‌, సల్మాన్‌ సొంత తమ్ముడిలా చూసుకున్నారు'

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్​ భారత్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్​ ఖాన్​ తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారని చెప్పుకొచ్చాడు.

shoaib akhtar
షోయబ్ అక్తర్

భారతదేశంలో తనకెన్నో మధుర స్మృతులు ఉన్నాయని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అంటున్నాడు. త్వరలోనే రెండు దేశాల సంబంధాలు మెరుగవుతాయని ఆశించాడు. బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ తనని సొంత తమ్ముడిలా చూసుకొనేవారని గుర్తు చేసుకున్నాడు.

'ముంబయి వాసులతో కలవడం నాకెంతో ఇష్టం. సల్మాన్‌, షారుఖ్‌ నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలిసినప్పుడు భద్రంగా చూసేవాళ్లు. దురదృష్టవశాత్తూ ఐదేళ్లుగా భారత్‌కు రాలేదు. కానీ ఒకప్పుడు నన్నక్కడ ఆధార్‌ కార్డు, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని అడిగేవారు! ఎందుకంటే నేనంతగా అక్కడ పనిచేశాను' అని అక్తర్‌ అన్నాడు.

'భారత్‌లో నాకెన్నో మధురస్మృతులు ఉన్నాయి. నేను మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాలని ప్రార్థిస్తున్నాను. మరికొన్ని నెలల్లో భారత్, పాక్‌ సంబంధాలు మెరుగవ్వాలని కొన్ని రోజుల ముందే నా మిత్రులతో అన్నాను. అలా జరగ్గానే భారత్‌లో వాలిపోయే మొదటి పాకిస్థానీని నేనే అవుతా. అంతేకాదు టన్నుల కొద్దీ డబ్బు సంపాదించుకుంటా (నవ్వుతూ)' అని షోయబ్‌ అన్నాడు. ఈ రావల్పిండీ ఎక్స్‌ప్రెస్‌కు భారత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది! హిందీ చిత్ర పరిశ్రమలో అతడికి సన్నిహితులు ఉన్నారు. అంతేకాకుండా కొన్ని టీవీ రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు.

ఇదీ చదవండి:'నిలకడతో పాటు వేగంగా ఆడితే విజయం మాదే'

ABOUT THE AUTHOR

...view details