One Ball Highest Runs : క్రికెట్లో ఎన్నో వింతలను మనం చూస్తుంటాం. ఒక్కోసారి బౌలర్లు అనుకోకుండానే తమ ప్రత్యర్థి జట్టుకు భారీ స్థాయిలో పరుగులను సమర్పించుకుంటూ కనిపిస్తుంటారు. అయితే ఒక్క ఓవర్‌లో 18 పరుగులు సమర్పించుకుంటే అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఒక్క బంతికి 18 పరుగులు ఇస్తే మాత్రం అది సెన్సేషనే అవుతుంది. సేలమ్ స్పార్టాన్స్ టీమ్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ చేసిన ఈ పనితో ప్రత్యర్థి జట్టుకు ఒక బంతికే 18 పరుగులు వచ్చేశాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్‌లో అభిషేక్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెట్టింట అభిషేక్ తన్వర్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా మంగళవారం రాత్రి సేలమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ జట్ల మధ్య హోరా హోరీ మ్యాచ్ జరిగింది. ఇక చెపాక్ సూపర్ గల్లీస్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ బౌలింగ్‌కు దిగాడు. మరోవైపు క్రీజులో సంజయ్ యాదవ్ ఉన్నాడు. తొలుత నాలుగు బంతులకు అభిషేక్ తన్వర్ 6 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇక ఐదవ బంతి నోబాల్ కాగా.. ఆ తర్వాత బంతికి ఓ పరుగు వచ్చింది. దీంతో ఐదు బంతుల్లో అభిషేక్ తన్వర్ మొత్తంగా ఎనిమిది పరుగులను ప్రత్యర్థి జట్టుకు ఇచ్చుకున్నాడు. అయితే ఓవర్ చివరి బంతి వేయడానికి అభిషేక్ నానా కష్టాలు పడ్డాడు.