Mirabai Chanu Silver Medal: ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ విజేత మీరాబాయి చాను భారత్‌కు రజత పతకాన్ని అందించింది. కొలంబియాలోని బొగొటా వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో 49 కేజీల విభాగంలో మీరాబాయి తలపడింది. మొత్తం 200 కేజీల(87 కిలోల స్నాచ్, 113కిలోల క్లీన్ అండ్ జర్క్) బరువును ఎత్తి పతకం సాధించింది. 206(93+113) కిలోలు ఎత్తిన చైనా క్రీడాకారిణి జియాంగ్ జిహువా స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. 198 కేజీలు(89+109)ఎత్తి టోక్యో క్రీడాకారిణి హూ జిహువా కాంస్యం సాధించింది.
మీరాబాయి చాను@ రజతం.. మణికట్టు గాయంతోనే 200 కేజీల బరువు ఎత్తి..
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ విజేత మీరాబాయి చాను.. భారత్‌కు రజత పతకాన్ని అందించింది. మణికట్టు గాయంతో బాధపడుతున్నా.. పోటీల్లో పాల్గొని పతకం సాధించింది.
Saikhom Mirabai Chanu
సెప్టెంబర్ నుంచి మణికట్టు గాయంతో బాధపడుతున్న చాను గాయంతోనే ఈ పోటీల్లో పాల్గొంది. "ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవాలని మేం అనుకోలేదు. ఈ గేమ్ తర్వాత మాకు వచ్చే ఈవెంట్‌కు కావలసినంత సమయం ఉంది. ఇప్పుడు తన గాయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇక గేమ్ విషయంలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే, చాను సాధారణంగా ఎత్తే బరువే ఇది. భవిష్యత్తులో మరింత మెరుగవుతాం"అంటూ హెడ్ కోచ్ విజయ్ శర్మ తెలిపాడు.