Sai sudharsan tnpl 2023 : ఐపీఎల్ 2023లో తన ప్రదర్శనతో క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్నాడు గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ అదే దూకుడును ప్రదర్శిస్తున్నాడు. అలా ఈ ఐపీఎల్‌తో మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ కొనసాగుతోంది. ఈ లీగ్‌లో లైకా కోవై కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు నాలుగు హాఫ్ సెంచరీలు బాదేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి.. 110 సగటుతో 323 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు.
Sai Sudharsan ipl 2023 runs : ఐపీఎల్‌లో సూపర్ ఫామ్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం క్రికెట్ ప్రేమికులకు తెలిసిందే. ఫైనల్‌లో అయితే అతడు 47 బంతుల్లో 96 పరుగులు సాధించి.. గుజరాత్ టైటాన్స్‌కు అదిరిపోయేలా భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడి.. 50పైగా సగటుతో 362 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.
చివరి పది ఇన్నింగ్స్‌లో.. సాయి సుదర్శన్ ఆడిన చివరి 10 ఇన్నింగ్స్‌లోని గణాంకాలను పరిశీలిస్తే.. 53, 19, 20, 47, 43, 96 (ఐపీఎల్ ఫైనల్), 86, 90, 64*, 7 పరుగులు చేశాడు. నేడు(జూన్ 25) దిండిగుల్ డ్రాగన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భీకర ఫామ్‌ను కొనసాగించాడు. 41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ భారీ స్కోర్ అందుకుంది. దీంతో క్రికెట్ ప్రియులు అతడి తుఫాను ఇన్నింగ్స్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
IND VS WI 2023 : విండీస్ టూర్‌కు ఎంపిక చేయాలి.. సాయిని.. వెస్టిండీస్ సిరీస్‌లో టీమ్ఇండియా టీ20 టీమ్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అతడు జట్టుకు ఎంపిక కావడానికి ఇంతకంటే ఏం కావాలని అడుగుతున్నారు. అతడి ఆటతీరు, నిలకడగా రాణించే విధానం, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం.. ఇలా వీటిని పరిగణలోకి తీసుకొని భారత జట్టుకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. యశస్వి, రుతురాజ్ లాంటి వారికి అవకాశం ఇచ్చారు కదా.. ఆ ఇద్దరి కన్నా సాయి ఏమాత్రం తీసిపోడని అంటున్నారు.